హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'రాజ్యాంగంపై విద్యార్థులకు అవగాహన కల్పించాలి'

VSP: రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మద్దిలపాలెంలో చైల్డ్ రైట్స్ అవేర్నెస్ ఫోరం, జీవీఎంసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ సంయుక్తంగా రూపొందించిన ‘భారత రాజ్యాంగం సూక్ష్మంగా’ పుస్తకాన్ని వి.వి.వామనరావు ఆవిష్కరించారు. విద్యార్థి దశ నుంచే రాజ్యాంగంపై అవగాహన కల్పించేందుకు పాఠశాలలు, కళాశాలల్లో ఉపాధ్యాయులు ప్రత్యేక సమయం కేటాయించాలని ఆయన సూచించారు.