W.G: ఆకివీడు మండలంలోని 16 పంచాయతీలలో సర్పంచ్ పదవులకు 22, వార్డు సభ్యుల పదవులకు 15 నామినేషన్లు ఉపసంహరించుకున్నారని MPDO బాబురావు తెలిపారు. సర్పంచ్ పదవులకు 88, వార్డు సభ్యుల పదవులకు 439 నామినేషన్లు దాఖలయ్యాయని ఆయన పేర్కొన్నారు. నామినేషన్ ఉపసంహరణలో మొదటి రోజు సర్పంచులు 22, వార్డు సభ్యులు 15 మంది ఉపసంహరించుకున్నారు. ఇంకా రెండు రోజుల గడువు ఉందని ఆయన తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఆకివీడులో సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్ల ఉపసంహరణ


