హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పర్మిట్ లేకుంటే రూ.10 వేల జరిమానా:

TPT: జిల్లాలో పర్మిట్ లేకుండా ఆటోలు, మోటార్ క్యాబ్‌లు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా రవాణా శాఖ అధికారి కొర్రపాటి మురళీమోహన్ హెచ్చరించారు. సెక్షన్ 192A కింద కేసులు నమోదు చేసి, రూ.10 వేల వరకు జరిమానా విధిస్తామని స్పష్టం చేశారు. వాహన యజమానులు తప్పనిసరిగా సంబంధిత పర్మిట్లు పొందిన తర్వాతే వాహనాలను నడపాలని సూచించారు.