హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన స్పెషల్ స్ట్రైకింగ్ సీఐ

VZM: గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కొత్తవలస డాబాలు ఎంపీపీ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని స్పెషల్ స్ట్రైకింగ్ సీఐ పి. శోభన్ బాబు బుధవారం సందర్శించారు. పోలింగ్ బూత్‌లోకి ఓటర్లను తప్ప బయటవారిని అనుమతించకూడదని సిబ్బందికి సూచించారు. విధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. మొబైల్స్ పోలింగ్ కేంద్రంలోకి అనుమతించకూడదని సిబ్బందిని ఆదేశించారు.