హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి'

PPM: విద్యార్థుల విద్యా ప్రమాణాలను మెరుగుపరచడంతో పాటు వారి ఆరోగ్యం, వ్యక్తిగత పరిశుభ్రత, పోషకాహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఐటీడీఏ డీడీ మురళిధర్ అధికారులకు బుధవారం సూచించారు. రెగిడి గిరిజన బాలికల పాఠశాలను అయన తనిఖీ చేశారు. పాఠశాల పరిసరాలు, వంటగది, స్నానపు గదులు, మరుగుదొడ్లు, తరగతి గదులను పరిశీలించి పరిశుభ్రతను నిరంతరం పాటించాలన్నారు.