హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గ్రామాల అభివృద్ధే కూటమి ధ్యేయం

అన్నమయ్య: గ్రామాల అభివృద్ధి, ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని టీడీపీ ఇంఛార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు తెలిపారు. జనసేన నేత అతికారి కృష్ణ, బీజేపీ నాయకులతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గ్రామాల్లో మౌలిక వసతులు, తాగునీరు, రహదారులు, పారిశుధ్యానికి ప్రాధాన్యమిస్తున్నామన్నారు. అభివృద్ధి కొనసాగేందుకు కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు.