ప్రకాశం: కనిగిరి నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికల పోలింగ్‌కు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. నియోజకవర్గంలో మొత్తం 135 గ్రామ పంచాయతీలకు గాను 49పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 86 పంచాయతీల్లో రేపు పోలింగ్ జరగనుంది. 86 సర్పంచ్ పదవుల కోసం 258 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. ప్రశాంతంగా పోలింగ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
కనిగిరిలో పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం


