హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఏకగ్రీవ సర్పంచ్, వార్డు సభ్యులకు ప్రత్తిపాటి సత్కారం

PLD: చిలకలూరిపేట మండలం గొట్టిపాడు ఏకగ్రీవ సర్పంచ్ పాములపాటి నారద, వార్డు సభ్యులు మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావును కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ప్రజల నమ్మకాన్ని నిలబెడుతూ గ్రామ అభివృద్ధికి కృషి చేయాలని ప్రత్తిపాటి సూచించారు. అనంతరం వారిని శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు.