కడప జిల్లాలో నవంబర్ 26న జరగనున్న తొలి విడత పంచాయతీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి తెలిపారు. 13 మండలాల్లో 130 సర్పంచ్, 1,318 వార్డు స్థానాలకు పోలింగ్ జరగనుంది. మొత్తం 4,924 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహించనున్నారు.
ఆంధ్రప్రదేశ్
తొలి విడత పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం: కలెక్టర్


