హైదరాబాద్: 28°C
తెలంగాణ

వైభవంగా శ్రీవారి జాతర మహోత్సవం

JGL: కోరుట్ల మండలం వెంకటాపూర్ గ్రామ శివారులోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బుధవారం జాతర మహోత్సవం వైభవంగా నిర్వహించారు. కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి, అలివేలు మంగ, పద్మావతి సమేతంగా రథంపై ఊరేగించారు. రథోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.