హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గ్రామాలకు తరలిన ఎన్నికల సిబ్బంది

ATP: మొదటి దశ గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో అనంతపురం రూరల్ మండలంలో ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. బుధవారం అనంతపురం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రం నుంచి ఎన్నికల సిబ్బంది బ్యాలెట్ పత్రాలు, ఎన్నికల సామగ్రితో ప్రత్యేక బస్సుల్లో తమకు కేటాయించిన గ్రామాలకు తరలివెళ్లారు.