హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కూటమి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించండి: మంత్రి

కోనసీమ: పంచాయతీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని మంత్రి వాసంశెట్టి సుభాష్ పిలుపునిచ్చారు. అన్నయ్యపేట, ద్రాక్షారామం, వెలంపాలెంలో ఆయన విస్తృత ప్రచారం నిర్వహించారు. సీఎం చంద్రబాబు, DY.CM పవన్ కళ్యాణ్ పాలనలోని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల వల్లే కూటమి గెలుపు ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ మేడిశెట్టి శేషారావు, కూటమి నేతలు పాల్గొన్నారు.