హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జీ.మాడుగుల ఎంపీపీగా బాధ్యతలు

ASR: జీ.మాడుగుల ఎంపీపీగా గబ్బాడి శాంతి కుమారి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ముఖ్య అతిథిగా హాజరై ఎంపీపీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం శాంతి కుమారికి బాధ్యతలు అప్పగించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులకు అందేలా కృషి చేయాలని నేతలు, కార్యకర్తలకు సూచించారు. ఇందులో జడ్పీటీసీ సభ్యురాలు సోమెలి అఖిల, వైస్ ఎంపీపీ రమేష్ పాల్గొన్నారు.