హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఓటర్లు నిర్భయంగా ఓటు వేయాలి: కలెక్టర్

ATP: జిల్లాలో రేపు జరిగే తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 13 మండలాల్లో 2,388 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 210 సర్పంచ్ స్థానాలకు 539 మంది, 1,832 వార్డులకు 3,786 మంది పోటీ చేస్తున్నారు. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్, 2 గంటల నుంచి కౌంటింగ్ నిర్వహించనున్నారు. ఓటర్లు నిర్భయంగా ఓటు వేయాలని కలెక్టర్ ఆనంద్ కోరారు.