హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎలక్టరల్ లిటరసీ క్లబ్ పోటీల్లో బంటుమిల్లి విద్యార్థి ప్రతిభ

కృష్ణా: ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో, విద్యార్థులకు ఎన్నికల ప్రాముఖ్యం, ఓటింగ్ విధానాలపై అవగాహన కల్పించేందుకు ఎలక్టరల్ లిటరసీ క్లబ్ పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో బంటుమిల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన శ్యామ్ నియోజకవర్గ, జిల్లా స్థాయిలో విజయం సాధించాడు. వ్యాసరచన, క్విజ్ పోటీలలో ప్రతిభ కనపరిచి కలెక్టర్ బాలాజీ నుంచి మెమొంటో అందుకున్నాడు.