BPT: కర్లపాలెం(M) నాగరాజుపాలెం గ్రామ సర్పంచ్‌గా షేక్ వహిదాబి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. షేక్ మీరావలి (బుజ్జి) భార్య అయిన వహిదాబిని గ్రామస్తులు గ్రామ అభివృద్ధిని కాంక్షిస్తూ ఏకతాటిపైకి వచ్చి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ విషయాన్ని బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మరాజు అధికారికంగా ప్రకటించారు. అనంతరం నూతన సర్పంచ్‌కు ఆయన హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
నాగరాజుపాలెం సర్పంచ్‌గా షేక్ వహిదాబి ఏకగ్రీవ ఎన్నిక


