క్రికెట్లో సరికొత్త విప్లవం రాబోతోంది. పురుషులు, మహిళలు కలిసి ఒకే జట్టులో ఆడే తొలి టీ20 లీగ్ 'EQUAL' టోర్నీ 2027 ఆగస్టులో జర్మనీ వేదికగా జరగనుంది. ఇందులో మొత్తం ఐదు జట్లు తలపడనున్నాయి. తుది జట్టులో ఆరుగురు మహిళలు, ఐదుగురు పురుషులు కలిసి ఆడతారు. ఈ లీగ్‌ను జహీర్ ఖాన్ సహ యజమానిగా ఉన్న 'యాంకర్ స్పోర్ట్స్ AB', జర్మన్ క్రికెట్ ఫెడరేషన్ సంయుక్తంగా నిర్వహించబోతున్నాయి.
క్రీడలు
మిక్స్డ్ జెండర్ టీ20 లీగ్


