హైదరాబాద్: 28°C
క్రీడలు

క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి

మహిళల బిగ్ బాష్ లీగ్‌లో ఓ అరుదైన ఘటన చోటుచేసుకుంది. బ్యాటర్ డాటిన్ క్రీజులోకి రావడానికి 75 సెకన్ల కంటే ఎక్కువ సమయం తీసుకుంది. దీంతో BBL రూల్స్ ప్రకారం ఆమెను పిచ్‌కు 5 మీటర్ల దూరంలో నిలబెట్టారు. బౌలర్ గ్లెన్‌కు ఖాళీ స్టంప్స్‌పై 'ఫ్రీ బాల్' విసిరే అవకాశం ఇచ్చారు. బంతి స్టంప్స్‌కు తగలడంతో డాటిన్ ఒక్క బంతి ఆడకుండానే బౌల్డ్ అయింది. క్రికెట్ చరిత్రలో ఇలా ఔట్ కావడం ఇదే తొలిసారి.