హైదరాబాద్: 28°C
తెలంగాణ

యూత్ ఫెస్టివల్‌లో రుమానాకు మొదటి బహుమతి

గద్వాలలో జిల్లాస్థాయి యూత్ ఫెస్టివల్‌లో భాగంగా ఇంటర్మీడియట్ కాలేజీ విద్యార్థులకు చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. ఈ చిత్రలేఖన పోటీలో అలంపూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన విద్యార్థిని షేక్ రుమానా అద్భుతమైన ప్రతిభ కనబరిచి మొదటి బహుమతిని గెలుచుకుంది. ఇందులో భాగంగా విద్యార్థిని షేక్ రుమానా జిల్లా కలెక్టర్ రిజ్వాన్ చేతుల మీదుగా బహుమతిని అందుకుంది.