హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కేసీ కెనాల్ నీటి నియంత్రణపై సీఈ కబీర్ భాష పరిశీలన

KRNL: కేసీ కెనాల్ నీటి నియంత్రణ, సరఫరా విధానంపై ఇరిగేషన్ శాఖ చీఫ్ ఇంజినీర్ కబీర్ భాష బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలన నిర్వహించారు. కర్నూలు ఇరిగేషన్ సూపరింటెండింగ్ ఇంజినీర్‌తో కలిసి లాక్‌ ఇన్‌సులా వద్దకు చేరుకుని నీటి నియంత్రణ వ్యవస్థను పరిశీలించారు. నీటి ప్రవాహం, విడుదల విధానం, నియంత్రణకు సంబంధించిన అంశాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.