హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికల ప్రచారం నిర్వహించిన దుద్దుకుంట

సత్యసాయి: ఓబులదేవరచెరువు మండలంలోని పలు గ్రామాల్లో పుట్టపర్తి మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పార్టీ బలపరిచిన సర్పంచ్, వార్డు అభ్యర్థులను ప్రజలకు పరిచయం చేసి, వారి గుర్తులపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.