హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రీసర్వే గ్రౌండ్ ట్రూథింగ్ పనులు వేగవంతం చేయాలి: జేసీ

ATP: రీసర్వే గ్రౌండ్ ట్రూథింగ్ పనులు వేగవంతం చేసి నిర్దేశిత సమయంలో పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్ ఆదేశించారు. బుధవారం పామిడి గ్రామంలో జరుగుతున్న రీసర్వే పనులను ఆయన పరిశీలించారు. పనులు మందకొడిగా సాగుతున్నందున వేగం పెంచాలని సిబ్బందికి సూచించారు. తహసీల్దార్ శర్మిల, ఇన్‌స్పెక్టర్ ఆఫ్ సర్వే, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.