హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కేశాలింగాయపల్లె యువకునికి అరుదైన గుర్తింపు

KDP: మైదుకూరు మండలం కేశాలింగాయపల్లె గ్రామానికి చెందిన పెనుబడి చరణ్‌కు అరుదైన గుర్తింపు లభించింది. భారత ప్రభుత్వ మేరా యువ భారత్ నిర్వహిస్తున్న యువ సంవాద్ - సంవిధాన్ దివస్ కార్యక్రమానికి ఆయన అధికారిక యూత్ ఐకాన్‌గా నామినేట్ అయ్యారు. ఈ నెల 26న విజయవాడలో రాజ్యాంగ విలువలు, వికసిత్ భారత్-2047 లక్ష్యాలపై ఆయన అవగాహన కల్పించనున్నారు.