ప్రకాశం: టంగుటూరులో గ్రామ పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ పి.రాజబాబు, ఎస్పీ హర్షవర్ధన రాజు బుధవారం పరిశీలించారు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో సిబ్బందికి కల్పించిన వసతులు, బస్సుల రూట్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జిల్లా పరిషత్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ చిరంజీవి, ఎంపీడీఓ తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను పరిశీలించిన ఎస్పీ, కలెక్టర్


