హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నరసరావుపేటలో రేపు పోలింగ్ సెలవు

PLD: పురపాలక ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో నరసరావుపేటలో గురువారం (నవంబర్ 26) విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. నరసరావుపేటతో పాటు మొత్తం 19 మున్సిపాలిటీలు, నాలుగు కార్పొరేషన్లలో ఓటింగ్ జరగనుంది. పోలింగ్ ప్రాంతాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, కార్యాలయాలకు సెలవు వర్తిస్తుంది. అదే రోజు గ్రామ పంచాయతీ తొలి విడత పోలింగ్ కూడా ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు జరుగుతుంది.