NTR: వీరులపాడు మండలం గోకరాజుపల్లికి చెందిన నరేష్ ఇటీవల తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన అమానవీయ ఘటనలో మృతి చెందాడు. ఆయన కుటుంబాన్ని రాష్ట్ర షెడ్యూల్డ్ తెగల కమిషన్ సభ్యుడు పీ.వెంకటప్ప పరామర్శించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. చట్టప్రకారం అందాల్సిన ప్రభుత్వ సహాయాన్ని త్వరితగతిన అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
వీరులపాడులో పర్యటించిన ఎస్టీ కమిషన్ సభ్యుడు


