TPT: నాయుడుపేట పట్టణంలో ఉదయం నుంచి కురుస్తున్న వర్షంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులు, లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచిపోయింది. డ్రైనేజీలు ఉన్న చోట్ల సైతం నీరు బయటకు వెళ్లకపోవడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. వర్షం కొనసాగుతుండటంతో మరిన్ని ప్రాంతాల్లో నీరు చేరుతుందేమోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
వాన నీటితో పట్టణవాసుల ఇబ్బందులు


