KRNL: రాంప్రసాద్ గురుస్వామి ఆధ్వర్యంలో ఏడుగురు అయ్యప్ప స్వాములు బుధవారం పత్తికొండ నుంచి శబరిమలకు మహాపాదయాత్రగా బయలుదేరారు. స్థానిక అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, గురుస్వాములు ఇరుముడి కట్టారు. అనంతరం స్వాములు ఇరుముడులు ధరించి అయ్యప్ప శరణుఘోషతో పాదయాత్ర ప్రారంభించారు. భక్తులు హారతులు ఇచ్చి, నిండుబిందెలతో వారిని ఘనంగా సాగనంపారు.
ఆంధ్రప్రదేశ్
పత్తికొండ నుంచి శబరిమలకు మహాపాదయాత్ర


