కర్నూలులో అంతర్జాతీయ మహిళలపై హింస నిర్మూలన దినోత్సవం నిర్వహించారు. మహిళలపై హింస, వివక్ష, వేధింపులను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సీడబ్ల్యూసీ చైర్మన్ ప్రవీణ్ కుమార్ కోరారు. మహిళలకు చట్టాలపై అవగాహన కల్పించి, బాధితులకు న్యాయ సహాయం అందించాలని సూచించారు. అనంతరం మహిళల భద్రత, హెల్ప్‌లైన్ నంబర్లపై అవగాహన పోస్టర్లను విడుదల చేశారు.
ఆంధ్రప్రదేశ్
'మహిళలపై హింస నిర్మూలనకు సమష్టి కృషి అవసరం'


