PPM: భారత రాజ్యాంగ దినోత్సవాన్ని నవంబర్ 26న జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్. ప్రభాకర రెడ్డి అధికారులను ఆదేశించారు. జిల్లా, డివిజన్, మండల స్థాయిల్లో విద్యార్థులు, యువత, ప్రజల భాగస్వామ్యంతో వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఉదయం 11 గంటలకు రాజ్యాంగ పీఠికను సామూహికంగా పఠించాలని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవ వేడుకలు


