హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాచేపల్లి సర్పంచ్‌గా ఉమాదేవి ఏకగ్రీవ ఎన్నిక

ATP: శింగనమల మండలం రాచేపల్లి సర్పంచ్‌గా ఎమ్మెస్ ఉమాదేవి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బుధవారం పంచాయతీ కార్యాలయంలో అధికారులు ఆమెకు ఎన్నిక ధ్రువీకరణ పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బండారు శ్రావణి శ్రీ, ఎమ్మెస్ రాజు పాల్గొని అభినందించారు. గ్రామస్తులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై ఘన స్వాగతం పలికారు.