ప్రకాశం: ముంబైలో జరుగుతున్న 3వ వరల్డ్ మేయర్స్ ఫోరమ్‌కు కనిగిరి మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ షేక్ నాయబ్ రసూల్ హాజరయ్యారు. AIILSG శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న ఈ సదస్సులో మున్సిపల్ కమిషనర్ పి.శ్రీధర్ తరఫున పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా వెయ్యికి పైగా నగరాల ప్రతినిధులు పాల్గొంటున్న ఈ సదస్సుతో కనిగిరి మున్సిపాలిటీకి అంతర్జాతీయ గుర్తింపు లభించింది.
ఆంధ్రప్రదేశ్
అంతర్జాతీయ సదస్సులో కనిగిరికి ప్రాతినిధ్యం


