సిరాజ్‌ను అనవసరపు వివాదాల్లోకి లాగొద్దని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా కోరారు. సిరాజ్ ఇప్పటికీ భారత జట్టులో భాగమేనని స్పష్టం చేశారు. తుది జట్టులో చోటు కల్పించడం అనేది పిచ్ పరిస్థితులను బట్టి కోచ్, కెప్టెన్ తీసుకునే నిర్ణయమని పేర్కొన్నారు. వివాదాల్లోకి లాగడం వల్ల సిరాజ్‌తో పాటు భారత జట్టుకు కూడా నష్టమేనని వ్యాఖ్యానించారు. రాజకీయాలకు సిరాజ్‌ను వాడుకోవడం సరికాదంటూ హితవు పలికారు.
క్రీడలు
సిరాజ్ వివాదంపై బీసీసీఐ స్ట్రాంగ్ కౌంటర్


