హైదరాబాద్: 28°C
క్రీడలు

వైభవ్ బ్యాటింగ్‌‌కు కివీస్ కోచ్ ఫిదా

యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ డబుల్ సెంచరీపై న్యూజిలాండ్ బౌలింగ్ కోచ్ జాకబ్ ఓరమ్ స్పందించాడు. వైభవ్ బ్యాటింగ్ చూస్తుంటే ముచ్చటేస్తోందని అన్నాడు. అభిమానులను అలరించడమే లక్ష్యంగా అతడి బ్యాటింగ్ సాగుతుందని చెప్పాడు. వైభవ్ లాంటి ఆటగాళ్లు మరింత మంది వస్తే వన్డే క్రికెట్‌కు ఢోకా ఉండదని పేర్కొన్నాడు. UAEపై అతడు చేసిన ప్రదర్శనను తమ జట్టుపై చేయకూడదని కోరుకుంటున్నట్లు సరదాగా వ్యాఖ్యానించాడు.