హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రౌడీ షీటర్లను హెచ్చరించిన ఏఎస్పీ సుస్మిత

NDL: నంద్యాల రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉన్న ఆయా గ్రామాల రౌడీషీటర్లు, పాత నేరస్తులను బుధవారం రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఏఎస్పీ సుస్మిత సమావేశపరిచారు. గ్రామపంచాయతీ ఎన్నికల్లో రౌడీ షీటర్లు అల్లర్లు చేస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె వారిని హెచ్చరించారు. ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునే విధంగా పనిచేస్తామని ఆమె అన్నారు.