E.G: వరుస ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వం బీసీలకు అత్యధిక ప్రాధాన్యత కల్పిస్తోందని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు. కార్పొరేటర్ అభ్యర్థుల ఎంపికతో పాటు రిజర్వేషన్లలోనూ బీసీలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకున్నామన్నారు. కడియంలో కూటమి నాయకులు, కార్యకర్తలతో మాట్లాడుతూ.. బీసీలకు కూటమిలో మంచి భవిష్యత్తు ఉంటుందని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
అభ్యర్థుల ఎంపికలో బీసీలకు పెద్దపీట: ఎమ్మెల్యే


