హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కేంద్ర మంత్రిని కలిసిన ఎంపీ బైరెడ్డి శబరి

NDL: న్యూఢిల్లీలోని పార్లమెంట్ హాల్లో కేంద్ర విద్యా శాఖ మంత్రి ప్రహల్లాద్ జోషిని నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి మర్యాదపూర్వకంగా కలిశారు. నంద్యాల జిల్లాలో ఉన్న సమస్యలను ఆమె కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. మీ సమస్యలన్నీ త్వరలోనే పరిష్కరిస్తానని కేంద్రమంత్రి ఆమెకు హామీ ఇచ్చినట్లు బైరెడ్డి శబరి పేర్కొన్నారు.