హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అధిక ధరలకు విక్రయిస్తే ఫిర్యాదు చేయండి: జేసీ

సత్యసాయి: ధర్మవరంలో ధరణి బియ్యం కేంద్రాన్ని JC మౌర్య భరద్వాజ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. బియ్యం, పప్పుధాన్యాల నిల్వలు, రికార్డులను పరిశీలించారు. ధరలు, స్టాక్ వివరాల బోర్డులు ప్రదర్శించాలని, ప్రభుత్వ ధరలకే విక్రయించాలని ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అధిక ధరలకు విక్రయిస్తే 08555-288566కు ఫిర్యాదు చేయాలని సూచించారు.