హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జూనియర్ కళాశాలను సందర్శించిన DIEO

ASR: DIEO భీమశంకరరావు బుధవారం సీలేరు ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించారు. కళాశాల రికార్డులు పరిశీలించి, విద్యార్థులకు రాబోయే పబ్లిక్ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించేలా సూచనలు ఇచ్చారు. గంజాయి, ధూమపానం, మద్యం వంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఈ సందర్భంగా కళాశాల అభివృద్ధి వివరాలను ప్రిన్సిపాల్ శంకర్రావు వివరించారు.