PDPL: రామగుండం సింగరేణి సేవా భవన్లో వివిధ వృత్తి విద్యా కోర్సుల బోధకుల ఎంపిక ప్రక్రియ చేపట్టారు. బుధవారం నిర్వహించిన ఇంటర్వ్యూల్లో అభ్యర్థుల అనుభవం, బోధనా సామర్థ్యాలను పరిశీలించారు. ఎంపికైన వారికి గౌరవ వేతనం అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. సేవా అధ్యక్షురాలు అనిత, లలిత్ కుమార్, అధికారులు పాల్గొన్నారు.
తెలంగాణ
వృత్తివిద్య కోర్సుల బోధకుల ఎంపికకు ఇంటర్వ్యూలు


