హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

న్యాయవాదుల రక్షణకు మణిబాబు గర్జన

NTR: నందిగామ బార్ అసోసియేషన్ మాజీ ప్రధాన కార్యదర్శి అద్దంకి మణిబాబు న్యాయవాదుల రక్షణ కోసం గళం విప్పారు. న్యాయవాదులకు రక్షణ చట్టం, ఉచిత ఆరోగ్య బీమా, సంక్షేమ ప్రయోజనాలు, మెరుగైన కోర్టు మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకుండా నైట్ కోర్టుల ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించారు. దీనిని వెంటనే ఉపసంహరించుకోవాలని అన్నారు.