NTR: తిరువూరు నియోజకవర్గంలో ఏఎస్డీడీ జాబితాలో గుర్తించిన ఓటర్లకు మరో అవకాశం కల్పిస్తున్నట్లు ఆర్డీవో ఏ.కుమార్ తెలిపారు. గైర్హాజరు, వలస, మరణించిన, డూప్లికేట్ ఓటర్ల జాబితాలో ఉన్న అర్హులు సంబంధిత ఆధారాలతో తమ పేర్లు నమోదు చేసుకోవచ్చన్నారు. అందుకు బీఎల్ఓలు లేదా తహసీల్దార్ కార్యాలయాలను సంప్రదించాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే లక్ష్యమన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఓటర్లకు మరో అవకాశం ఆర్డీవో


