హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సమస్యాత్మక వార్డుల్లో పోలీసులు ఫ్లాగ్ మార్చ్

శ్రీకాకుళం నగర పాలక సంస్థ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులు పటిష్ట భద్రత చేపట్టారని అధికారులు బుధవారం తెలిపారు. ఎస్పీ ఆదేశాలతో ఇన్‌స్పెక్టర్ రామకృష్ణ ఆధ్వర్యంలో సమస్యాత్మక వార్డుల్లో ఫ్లాగ్ మార్చ్ చేశారని చెప్పారు. గూనపాలెం, మహాలక్ష్మినగర్, మండలివీధి, హయాతినగరంలో కవాతు చేసి ప్రజలకు భరోసా కల్పించారన్నారు. ప్రజలు భయపడకుండా ఓటు వేయాలన్నారు.