హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పవన్ నిధులు ప్రొద్దుటూరుకు శాపమా: మాదాసు మురళీ

KDP: ప్రొద్దుటూరు నియోజకవర్గ అభివృద్ధి కోసం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రూ.3.50 కోట్లు కేటాయించడం టీడీపీ నేతలకు వరమో.. శాపమో అర్థం కావడం లేదని జనసేన సమన్వయకర్త మాదాసు మురళి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని 82 మున్సిపాలిటీల్లో జనసేనకు ప్రాతినిధ్యం కల్పించినప్పటికీ, ప్రొద్దుటూరులో ఒక్క కో-ఆప్షన్ పదవి కూడా ఇవ్వకపోవడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.