హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: గుంతలమయంగా రావులపర్రు రైస్ మిల్లు రోడ్డు

ELR: ఉంగుటూరు మండలం రావులపర్రు రైస్ మిల్లు నుంచి వెళ్లే రహదారి గోతులతో అధ్వానంగా మారింది. ఏ మాత్రం అజాగ్రత్తగా వెళ్లినా ప్రమాదం తప్పదని వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. రాత్రి సమయంలో పలువురు ద్విచక్ర వాహనదారులు గోతుల్లో పడిపోయిన సంఘటనలు జరిగాయి. రైతులు, ధాన్యం వాహనాలు కూడా ఇబ్బంది పడుతున్నాయి. రోడ్డు మరమ్మతు చేసి ప్రమాదాలు నివారించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.