హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం

ELR: కొయ్యలగూడెం మండలంలో పంచాయతీ ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పోలింగ్ సిబ్బందిని ఏడు ప్రత్యేక రూట్లలో బస్సుల ద్వారా పోలింగ్ కేంద్రాలకు తరలించారు. డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌లో బ్యాలెట్‌ బాక్సులు, పత్రాలు, ఇంకు తదితర సామగ్రిని అందజేసి, పోలీసు బందోబస్తు మధ్య సిబ్బంది తమ కేంద్రాలకు బయలుదేరారు.