హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైజ్ఞానిక ప్రదర్శనను పరిశీలించిన ఎంఈఓ

ప్రకాశం:  విద్యార్థుల్లో శాస్త్రీయ ఆలోచనా విధానాన్ని పెంపొందించి, సాంకేతిక పరిజ్ఞానంపై ఆసక్తి కల్పించేందుకు సైన్స్ ఫెయిర్‌లు దోహదపడతాయని మండల ఎంఈఓ సత్తార్ అన్నారు. బుధవారం కంభం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన వైజ్ఞానిక ప్రదర్శనను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులు రూపొందించిన వివిధ శాస్త్రీయ నమూనాలను పరిశీలించి వాటి పనితీరును అడిగి తెలుసుకున్నారు.