బీహార్‌లోని పాట్నాలో దారుణం జరిగింది. బిహ్‌తాకు చెందిన డ్రైవర్ మహమ్మద్ ఇర్ఫాన్(32) భార్య ఫౌజియా పొరుగింటి యువకుడు కరణ్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఇది తెలిసి భర్త హెచ్చరించడంతో, ఆయనను చంపాలని ఫౌజియా పథకం వేసింది. భర్త బ్యాంక్ అకౌంట్ నుంచే డబ్బులు తీసి, కాంట్రాక్ట్ కిల్లర్లతో హత్య చేయించింది. పోలీసులు దర్యాప్తుతో అసలు నిజం బయటపడింది.
వార్తలు
భర్త డబ్బుతోనే కాంట్రాక్ట్ కిల్లర్లతో హత్య!


