హైదరాబాద్: 28°C
వార్తలు

ఇద్దరికి ఒకే బ్యాంకు ఖాతా.. ట్విస్ట్ ఏంటంటే?

MPలో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. వేర్వేరు గ్రామాలకు చెందిన హుకుమ్ అనే పేరు గల ఇద్దరు వ్యక్తులకు బ్యాంకు అధికారులు పొరపాటున ఒకే ఖాతాను కేటాయించారు. దీంతో ఒకరి ఖాతాలో వేసిన నగదు మరో హుకుమ్ రూ.89 వేలు డ్రా చేసుకున్నాడు. ఆరా తీయగా..'విదేశాల నుంచి నల్లధనం తెచ్చి ఖాతాల్లో వేస్తానని మోదీ చెప్పారని, అలా భావించి డబ్బులు వాడుకున్నాను' అని అన్నాడు. ప్రస్తుతం ఈ వార్త SMలో వైరలవుతోంది.