హైదరాబాద్: 28°C
వార్తలు

గుజరాత్‌లో దారుణం

గుజరాత్‌లోని సూరత్ జిల్లా బార్డోలీ సమీపంలో దారుణం జరిగింది. కూలి పని కోసం మహారాష్ట్ర జల్గాన్ నుంచి వస్తున్న ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురిని ఆగంతకులు కారు అడ్డగించి కాలువలోకి నెట్టేశారు. కాలువలోని పైపు సహాయంతో 13 ఏళ్ల బాలుడు ప్రాణాలతో బయటపడగా, గల్లంతైన భార్యాభర్తలు నితిన్, కవిత సహా ముగ్గురు చిన్నారుల కోసం రెస్క్యూ సిబ్బంది గాలిస్తున్నారు.